తీవ్ర రొమ్ముక్యాన్సర్‌ మందులకు లొంగేలా..

తీవ్ర రొమ్ముక్యాన్సర్‌ను మందులకు లొంగేలా మార్చొచ్చా? ఇది సాధ్యమేనంటూ కొరియా శాస్త్రవేత్తల అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా బేసల్‌-లైక్‌ రకం రొమ్ముక్యాన్సర్‌ చాలా తీవ్రంగా ఉంటుంది. చికిత్సకు అంతగా స్పందించదు.

Updated : 21 Dec 2021 06:35 IST

తీవ్ర రొమ్ముక్యాన్సర్‌ను మందులకు లొంగేలా మార్చొచ్చా? ఇది సాధ్యమేనంటూ కొరియా శాస్త్రవేత్తల అధ్యయనం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా బేసల్‌-లైక్‌ రకం రొమ్ముక్యాన్సర్‌ చాలా తీవ్రంగా ఉంటుంది. చికిత్సకు అంతగా స్పందించదు. అదే ల్యూమినల్‌-ఎ రకం రొమ్ముక్యాన్సర్‌ మందులకు బాగా స్పందిస్తుంది. ముఖ్యంగా కణాల మీదుండే గ్రాహకాల మీద పనిచేసే మందులు దీనికి బాగా పనిచేస్తాయి. అందువల్ల మొండి రొమ్ముక్యాన్సర్‌ను మందులకు లొంగే రకంగా మార్చటంపై పరిశోధకులు దృష్టి సారించారు. బీసీఎల్‌11ఏ, హెచ్‌డీఏసీ1/2 అనే కీలకమైన జన్యు నియంత్రకాలను పనిచేయకుండా చేస్తే ఇది సాధ్యమేనని గుర్తించారు. దీంతో తీవ్ర క్యాన్సర్‌ సమాచార మార్గాలు మందులకు లొంగే క్యాన్సర్‌ మార్గాలుగా మారిపోతున్నట్టు కనుగొన్నారు. అంటే మందులకు స్పందించేలా మారిపోతున్నాయన్నమాట. అయితే ఇది జంతువుల్లోనూ, మనుషుల్లోనూ ఇలాగే పనిచేస్తుందా అనేది తెలుసుకోవటానికి మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని