Health News: తేన్పు మంచిదే.. కానీ అతిగా తేన్పులు వస్తుంటే?

పదిమందిలో ఉన్నప్పుడు తేన్చటం సబబుగా అనిపించకపోవచ్చు. కానీ దీన్ని అణచుకోవటం తగదు. తేన్పు రావటానికి ప్రత్యేక కారణం లేకపోలేదు మరి. మనం ఏదైనా తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు మింగుతున్న ప్రతిసారీ కొంత గాలి లోపలికి వెళ్తుంది.

Updated : 25 Dec 2022 16:52 IST

దిమందిలో ఉన్నప్పుడు తేన్చటం సబబుగా అనిపించకపోవచ్చు. కానీ దీన్ని అణచుకోవటం తగదు. తేన్పు రావటానికి ప్రత్యేక కారణం లేకపోలేదు మరి. మనం ఏదైనా తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు మింగుతున్న ప్రతిసారీ కొంత గాలి లోపలికి వెళ్తుంది. ఇది అన్నవాహిక గుండా కిందికి సాగి, జీర్ణాశయం పైభాగాన పోగవుతుంది. దీంతో జీర్ణాశయం ఉబ్బుతుంది. అప్పుడు జీర్ణాశయ గోడల్లోని గ్రాహకాలు అన్నవాహికకు సంకేతాలు పంపుతాయి. ఇవి అన్నవాహిక, జీర్ణాశయం కలిసేచోట బిగుతైన కండర వలయం (స్ఫింక్టర్‌) కొద్దిగా తెరచుకునేలా చేస్తాయి. దీంతో గాలి బయటకు వచ్చి తేన్పు వస్తుంది. ఇదో రక్షణ ప్రక్రియ. జీర్ణాశయం మరీ ఎక్కువగా ఉబ్బకుండా కాపాడుతుంది. అయితే అతిగా తేన్పులు వస్తుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. జీర్ణరసాలు గొంతులోకి ఎగదన్నుకొని రావటం, ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ వంటి సమస్యల్లోనూ ఎక్కువగా తేన్పులు రావొచ్చు. ఇలాంటి సమస్యలేవీ లేకపోయినా అతిగా తేన్పులు వస్తుంటే కారణమేంటన్నది చూడాల్సి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

పానీయాలు: శీతల పానీయాలు, సోడా, బీరు వంటివి తాగుతున్నప్పుడు ఎక్కువగా గాలి లోపలికి వెళ్తుంది. స్ట్రాతో పానీయాలు తాగితే ఇంకాస్త ఎక్కువగానూ లోపలికి వెళ్తుంది. కాబట్టి నెమ్మదిగా తాగటం మంచిది.

వేగంగా తినటం: గబగబా తినేవారు నెమ్మదిగా తినటం అలవాటు చేసుకుంటే తేన్పులు తగ్గించుకోవచ్చు.

గమ్‌ నమలటం: చూయింగ్‌ గమ్‌ నమలటం లేదా చాక్లెట్ల వంటి బిళ్లలు చప్పరిస్తున్నప్పుడు కొందరు గాలినీ మింగుతుంటారు. ఇదీ తేన్పులకు దారితీస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని