నిరోధక వ్యవస్థతోనే గర్భిణులకు చేటు!

కారణాలేంటో స్పష్టంగా తెలియటం లేదు గానీ కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ2 బారినపడ్డ గర్భిణులకు తీవ్ర ముప్పులే పొంచి ఉంటున్నట్టు యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.

Published : 27 Apr 2021 01:19 IST

కారణాలేంటో స్పష్టంగా తెలియటం లేదు గానీ కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవీ2 బారినపడ్డ గర్భిణులకు తీవ్ర ముప్పులే పొంచి ఉంటున్నట్టు యేల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోగ్యవంతులైన గర్భిణులతో పోలిస్తే కొవిడ్‌ బారినపడ్డ వారిలో నెలలు నిండక ముందే కాన్పు కావటం, గర్భవాతం, ఇతర ప్రసవానంతర సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు తేలటం ఆందోళనకరం. నిజానికి ఊపిరితిత్తులు, ముక్కు కణజాలానికి మాయ దూరంగానే ఉంటుంది. అందువల్ల ఇందులో వైరస్‌ చాలా అరుదుగానే కనిపిస్తోంది. ఇది మంచి విషయమే అయినా... మాయలో చురుకుగా పనిచేసే రోగనిరోధక వ్యవస్థ ఇతర చిక్కులకు కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. చాలామందిలో తొలి త్రైమాసికంలో ఏస్‌2 గ్రాహకాలు కనిపిస్తున్నట్టు బయటపడింది. కాబట్టి గర్భం ధరించిన తొలినాళ్లలో ఎవరైనా కొవిడ్‌ బారినపడితే నిశితంగా పరిశీలించటం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని