కిడ్నీజబ్బుకు ఉత్తమ పరీక్ష!

దీర్ఘకాల కిడ్నీ జబ్బు (సీకేడీ) నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. తీవ్రమైతే కిడ్నీ వైఫల్యానికీ దారితీస్తుంది. కిడ్నీజబ్బును గుర్తించటానికి రక్తంలో క్రియాటినైన్‌ మోతాదులను తెలిపే పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.

Updated : 22 Mar 2022 05:43 IST

దీర్ఘకాల కిడ్నీ జబ్బు (సీకేడీ) నెమ్మదిగా ముదురుతూ వస్తుంటుంది. తీవ్రమైతే కిడ్నీ వైఫల్యానికీ దారితీస్తుంది. కిడ్నీజబ్బును గుర్తించటానికి రక్తంలో క్రియాటినైన్‌ మోతాదులను తెలిపే పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలియదు గానీ కొందరిలో క్రియాటినైన్‌ మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్నిసార్లు కిడ్నీజబ్బును పోల్చుకోవటమూ కష్టమవుతుంది. అందుకే కిడ్నీ పనితీరును తెలుసుకోవటానికి ఇతర ప్రొటీన్లపై పరిశోధకులు దృష్టి సారించారు. ఈ విషయంలో సిస్టాటిన్‌ సి ప్రొటీన్‌ బాగా ఉపయోగపడుతున్నట్టు గుర్తించారు. ఇది అందరిలోనూ ఒకే స్థాయిల్లో ఉంటుండటం విశేషం. సిస్టాటిన్‌ సి ప్రొటీన్‌ను మన శరీరంలోని కణాలు ఉత్పత్తి చేస్తుంటాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కిడ్నీలు దీని మోతాదులను సజావుగా ఉంచుతాయి. అందువల్ల ఇవి పెరిగిపోతే కిడ్నీలు సక్రమంగా పనిచేయటం లేదనే అర్థం. కాబట్టే క్రియాటినైన్‌ ఒక్కటే కాకుండా సిస్టాటిన్‌ సి మోతాదులనూ పరిగణనలోకి తీసుకుంటే చికిత్సలో తప్పులకు తావుండదని భావిస్తున్నారు. సిస్టాటిన్‌ సి మోతాదులు 0.62 నుంచి 1.15 ఎంజీ/ఎల్‌ ఉంటే నార్మల్‌. ఈ నార్మల్‌ స్థాయులు ఆయా పరీక్ష కేంద్రాలను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని