Published : 10 Jan 2023 00:28 IST

రక్తం గడ్డలతో దీర్ఘ కొవిడ్‌

కొవిడ్‌ కొందరిలో త్వరగానే తగ్గిపోయినా 40% మందిలో దీర్ఘకాలం వేధిస్తోంది. నిస్సత్తువ, అప్పుడప్పుడు ఆయాసం, మెదడు పనితీరు మందగించటం వంటివి సమస్యలతో బాధ పెడుతుంది. వాపుప్రక్రియ ప్రేరేపణతో పుట్టుకొచ్చే సూక్ష్మ రక్తం గడ్డలే దీనికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీర్ఘ కొవిడ్‌ శరీరంలో రక్తం గడ్డకట్టే తీరును ప్రభావితం చేస్తోందని, అందువల్ల దీన్ని రుగ్మతగా భావించాల్సిన అవసరముందని భావిస్తున్నారు. ఈ సూక్ష్మ రక్తం గడ్డలు రక్తంలో కలిసి అవయవాల సామర్థ్యానికి అడ్డు తగులుతుండటం గమనార్హం. ఇవి రక్తనాళాల్లో చేరి అవయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ సరఫరాను దెబ్బతీస్తున్నాయని.. కండరాలు, గుండె, ఇతర అవయవాల్లో తలెత్తే సమస్యలకు ఇదే కారణమవుతుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అప్పటికే జన్యుపరంగా రక్తం గడ్డకట్టే సమస్యలతో బాధపడేవారికిది మరిన్ని చిక్కులనూ తెచ్చిపెడుతోందని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు