సూక్ష్మక్రిములతో ఊబకాయం!

మన పేగుల్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీవక్రియల నియంత్రణకూ తోడ్పడతాయి. తిన్న ఆహారం జీర్ణం కావటం, పోషకాలను శరీరం గ్రహించుకోవటానికీ సాయం చేస్తాయి.

Published : 31 Jan 2023 00:13 IST

మన పేగుల్లో బోలెడంత బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీవక్రియల నియంత్రణకూ తోడ్పడతాయి. తిన్న ఆహారం జీర్ణం కావటం, పోషకాలను శరీరం గ్రహించుకోవటానికీ సాయం చేస్తాయి. ఇవి విడుదల చేసే ప్రొటీన్లు రక్తంలోకి చేరుకొని మనం ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? ఏం తినాలి? అనీ నిర్దేశిస్తాయి. అంటే బరువు అదుపులోనూ పాలు పంచుకుంటాయన్నమాట. షికాగో యూనివర్సిటీ పరిశోధకులు ఇంకాస్త భిన్నంగానూ అధ్యయనం చేశారు. ఎక్కువ కొవ్వు ఆహారం తిన్న ఎలుకల్లోని బ్యాక్టీరియాను ఎలాంటి బ్యాక్టీరియా లేని సన్నటి ఎలుకలకు మార్పిడి చేసి పరిశీలించారు. ఈ సన్న ఎలుకలు ఆహారంలోని కొవ్వును విభిన్నంగా విడమరచుకుంటున్నట్టు, బరువు పెరుగుతున్నట్టు గుర్తించారు. సూక్ష్మక్రిములు జీవక్రియలను ఎలా నియంత్రిస్తాయన్నది ఇంకా కచ్చితంగా బయట పడలేదు. దీన్ని గుర్తించగలిగితే ఆహారంతో పెరిగే బరువును నివారించుకునే మార్గం దొరికినట్టే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని