నానో పార్టికల్స్‌తో క్యాన్సర్‌పై దాడి

క్యాన్సర్‌కు ఒకటి కన్నా ఎక్కువ మందులతో చేసే చికిత్స సమర్థంగా పనిచేస్తుంది. అయితే మందుల మోతాదును కచ్చితంగా నిర్ణయించటం, ఇవన్నీ క్యాన్సర్‌ ఉన్నచోటుకు చేరుకునేలా చూడటమే సవాల్‌తో కూడుకున్న పని. వీటిని అధిగమించటానికి ఎంఐటీ పరిశోధకులు కొత్త నానోపార్టికల్‌ను రూపొందించారు.

Published : 31 Jan 2023 01:05 IST

క్యాన్సర్‌కు ఒకటి కన్నా ఎక్కువ మందులతో చేసే చికిత్స సమర్థంగా పనిచేస్తుంది. అయితే మందుల మోతాదును కచ్చితంగా నిర్ణయించటం, ఇవన్నీ క్యాన్సర్‌ ఉన్నచోటుకు చేరుకునేలా చూడటమే సవాల్‌తో కూడుకున్న పని. వీటిని అధిగమించటానికి ఎంఐటీ పరిశోధకులు కొత్త నానోపార్టికల్‌ను రూపొందించారు. బాటిళ్లను శుభ్రం చేయటానికి వాడే బ్రష్‌ ఆకారంలో ఉండే దీనిలో రకరకాల మందుల మిశ్రమాన్ని కూర్చొచ్చు. వీటి మోతాదులను తేలికగా నియంత్రించొచ్చు. ఈ పార్టికల్స్‌ సాయంతో పరిశోధకులు మూడు క్యాన్సర్‌ మందుల నిష్పత్తిని లెక్కించి, ఇవ్వగలిగారు. విడిగా ఇచ్చినప్పటికన్నా పార్టికల్‌ ద్వారా అందించినప్పుడు ఇవి ప్లాస్మాకణాల క్యాన్సర్‌ కణితిని కచ్చితంగా గుర్తించటం విశేషం. కణితి ఉన్నచోటికి మందులు చేరుకున్నాకే పని ఆరంభించటం వల్ల దుష్ప్రభావాలూ తక్కువగా ఉంటాయి. వీటిని వివిధ రకాల క్యాన్సర్ల చికిత్సకూ వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని