న్యుమోనియా రక్షక కణాలు

ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే న్యుమోనియాకు చాలావరకు స్ట్రెప్టోకాకస్‌ న్యుమోకాకస్‌ బ్యాక్టీరియానే కారణం. ఈ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైతే రక్తంలోకీ వ్యాపించొచ్చు.

Published : 21 Feb 2023 00:29 IST

ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే న్యుమోనియాకు చాలావరకు స్ట్రెప్టోకాకస్‌ న్యుమోకాకస్‌ బ్యాక్టీరియానే కారణం. ఈ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమైతే రక్తంలోకీ వ్యాపించొచ్చు. ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. మంచి యాంటీబయోటిక్‌ మందులు, టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యాక్టీరియా కారక తీవ్ర న్యుమోనియా బారినపడ్డవారిలో సుమారు 20% మంది పిల్లలు, 60% మంది వృద్ధులు మరణిస్తున్నారు. అయితే కొందరు దీనికి ఎందుకు బలవుతున్నారు? కొందరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? అనేవి ఇప్పటికీ తెలియని ప్రశ్నలుగానే మిగిలాయి. ఈ విషయంలో యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌పూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ అరస్‌ కడియోగ్లు నేతృత్వంలోని బృందం కొత్త విషయాన్ని గుర్తించింది. ఒకరకం తెల్ల రక్తకణాలు (టీఎన్‌ఎఫ్‌ఆర్‌2 ఎక్స్‌ప్రెసింగ్‌ ట్రెగ్స్‌) న్యుమోనియాను తట్టుకోవటానికి తోడ్పడుతున్నట్టు కనుగొంది. ఈ కణాల పనితీరు మందగించినా, ఇవి లేకపోయినా రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటానికి కారణమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో కణజాలం దెబ్బతిని, అక్కడ్నుంచి బ్యాక్టీరియా రక్తంలోకి విస్తరించటానికి వీలవుతోందని వివరిస్తున్నారు. ఫలితంగా సమస్య తీవ్రమై రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ (సెప్సిస్‌) తలెత్తటానికి దారితీస్తోందని చెబుతున్నారు. న్యుమోనియాకు కొత్త చికిత్సలను రూపొందించటానికి తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు