ఆయుష్షు పెంచుకోండి!

వయసు మీద పడుతున్నకొద్దీ క్రోమోజోముల తోక భాగాలు పొట్టిగా అవుతుంటాయి. ఫలితంగా మంచాన పడే ముప్పూ పెరుగుతుంది. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు.

Published : 21 Feb 2023 00:31 IST

వయసు మీద పడుతున్నకొద్దీ క్రోమోజోముల తోక భాగాలు పొట్టిగా అవుతుంటాయి. ఫలితంగా మంచాన పడే ముప్పూ పెరుగుతుంది. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన ఆహారం తినటం, వ్యాయామం చేయటం వంటి జీవనశైలి మార్పులు పాటిస్తే సరి. వీటితో క్రోమోజోముల తోకల పొడవును పెంచే ఎంజైమ్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.
* మనస్సాక్షికి లోబడి పనిచేసేవారు.. అంటే అన్ని విషయాలను క్షుణ్నంగా పరిశీలించి, ఆలోచించి, సరైన విధంగా నడచుకునేవారు ఎక్కువకాలం జీవిస్తున్నట్టు 80 ఏళ్ల పాటు నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. ఇలాంటివారు తమ ఆరోగ్యం కోసం మరింత ఎక్కువ శ్రద్ధ చూపటం.. ఆత్మీయ సంబంధాలు, మంచి కెరీర్‌కు దారితీసే నిర్ణయాలు తీసుకోవటం వంటివి ఆయుష్షు పెరగటానికి తోడ్పడుతున్నాయి.
* స్నేహితులతోనూ ఆయుష్షు పెరుగుతుంది. బలమైన సామాజిక అనుబంధాలు, దీర్ఘాయుష్షుకు సంబంధం ఉంటున్నట్టు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని