విష నిర్మూలనకు పెరుగు!

శరీరంలోంచి విషతుల్యాలను వదిలించుకోవటం (డిటాక్సింగ్‌) ఇటీవల ఒక ఫ్యాషన్‌గా మారింది. ఇందుకోసం రకరకాల  ద్రవాలు మార్కెట్లో ఉన్నాయి. 

Published : 28 Feb 2023 00:39 IST

రీరంలోంచి విషతుల్యాలను వదిలించుకోవటం (డిటాక్సింగ్‌) ఇటీవల ఒక ఫ్యాషన్‌గా మారింది. ఇందుకోసం రకరకాల  ద్రవాలు మార్కెట్లో ఉన్నాయి.  ఇవన్నీ మంచివే అనుకోవటానికి లేదు. పండ్లు, కూరగాయల రసాలతో చేసినప్పటికీ దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. ముఖ్యంగా వరుసగా మూడు, అంత కన్నా ఎక్కువ రోజులు తీసుకుంటే కిడ్నీ సమస్యలు తలెత్తొచ్చు. వీటికన్నా సహజ పద్ధతులు మేలు. ఇంట్లో తోడు పెట్టిన పెరుగును చెంచాడు.. లేదా గ్లాసు నీటిలో ఒక నిమ్మచెక్కను పిండి పరగడుపున తీసుకోవచ్చు. వీటిని మార్చి మార్చి (ఒకరోజు పెరుగు, మర్నాడు నిమ్మరసం) తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవి నెమ్మదిగా పనిచేయొచ్చు గానీ హాని అయితే చేయవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని