ఈస్ట్రోజెన్‌కూ పార్శ్వనొప్పికీ లంకె

పార్శ్వనొప్పి (మైగ్రేయిన్‌) మగవారి కన్నా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదీ రుతుక్రమం అవుతున్న దశలో తరచూ వస్తుంటుంది. రుతుక్రమం నిలిచాక (మెనోపాజ్‌) క్రమంగా తగ్గుతూ వస్తుంటుంది.

Published : 28 Feb 2023 01:12 IST

పార్శ్వనొప్పి (మైగ్రేయిన్‌) మగవారి కన్నా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదీ రుతుక్రమం అవుతున్న దశలో తరచూ వస్తుంటుంది. రుతుక్రమం నిలిచాక (మెనోపాజ్‌) క్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. దీని లోగుట్టును తెలుసుకునే దిశగా బెర్లిన్‌ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. హార్మోన్ల మోతాదులకూ మహిళల్లో పార్శ్వనొప్పికీ సంబంధం ఉంటున్నట్టు తాజాగా గుర్తించారు. నెలసరి సమయంలో ఈస్ట్రోజెన్‌ మోతాదులు తగ్గటంతో పాటు కాల్సిటోనిన్‌ జీన్‌-రిలేటెడ్‌ పెప్టైడ్‌ (సీజీఆర్‌పీ) పెరగటం పార్శ్వనొప్పిని ప్రేరేపితం చేస్తోందని కనుగొన్నారు. మహిళల జీవితంలో ఈస్ట్రోజెన్‌ మోతాదులు ఎక్కువ తక్కువ అవుతుంటాయి. ఇవి నెలసరి సమయంలో మరీ తగ్గుతాయి. అదే సమయంలో సీజీఆర్‌పీ పెరగటం సమస్యాత్మకంగా పరిణమిస్తోంది. నెలసరి సక్రమంగా అయ్యేవారిని, గర్భనిరోధక మాత్రలు వాడేవారిని, రుతుక్రమం ఆగిపోయిన వారిని పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు