దోమ కుట్టకుండా..

దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే? ఏముంది.. పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంటు ధరించాలి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు పరదాలు వేయాలి. మంచానికి దోమ తెర కట్టుకోవాలి.

Published : 13 Jun 2023 01:30 IST

దోమలు కుట్టకుండా చూసుకోవాలంటే? ఏముంది.. పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంటు ధరించాలి. ఇంట్లోకి దోమలు రాకుండా కిటికీలకు పరదాలు వేయాలి. మంచానికి దోమ తెర కట్టుకోవాలి. ఇంట్లో, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ తెలిసినవే. మరి సుగంధ ద్రవ్యాలు (పర్‌ఫ్యూమ్స్‌) చల్లుకోవటమూ మానెయ్యాలని తెలుసా? ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. సుగంధ ద్రవ్యాలు, సెంట్‌ లోషన్లకు దోమలు ఆకర్షితమవుతాయి మరి. దోమలు కుట్టకుండా చూసుకోవటానికి మరో మార్గం శుభ్రంగా ఉండటం. శరీరం చల్లగా ఉండటానికి చెమట తోడ్పడటం నిజమే గానీ దీనిలోని పదార్థాలు.. ముఖ్యంగా ల్యాక్టిక్‌ యాసిడ్‌ దోమలను ఆకర్షిస్తుంది. అంటే చెమట ద్వారా మనం దోమలకు మరింత చిరుతిండి లభించేలా చేస్తున్నామని అన్నమాట. కాబట్టి శారీరక శ్రమ, వ్యాయామం చేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేయటం మంచిది. దీంతో శరీరానికి హాయి కలగటమే కాదు, దోమల బాధ కూడా తప్పొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని