Health: రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా? జాగ్రత్త!

Health: రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా? పొగ, మద్యం కూడా తాగుతున్నారా? జాగ్రత్త! ఇలాంటి అలవాటు గలవారికి మరణించే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు ఫిన్‌లాండ్‌ పరిశోధకులు గుర్తించారు.

Updated : 20 Jun 2023 21:15 IST

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా? పొగ, మద్యం కూడా తాగుతున్నారా? జాగ్రత్త! ఇలాంటి అలవాటు గలవారికి మరణించే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు ఫిన్‌లాండ్‌(finland) పరిశోధకులు గుర్తించారు. పాతికేళ్ల వయసులో ఉన్న సుమారు 23వేల మందిని ఎంచుకొని.. 37 ఏళ్లకు పైగా పరిశీలించి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. పెందలాడే పడుకునేవారితో పోలిస్తే ఆలస్యంగా నిద్రించేవారికి ఏ కారణంతోనైనా మరణించే ముప్పు 9% ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. వీరంతా 8 గంటల కన్నా తక్కువసేపే నిద్రించటం గమనార్హం. ఈ మరణాలకు చాలావరకు పొగ, మద్యం అలవాట్లే కారణమవుతున్నట్టూ తేలింది. ఏ సమయానికి నిద్రిస్తున్నారనే దాని కన్నా ఈ అలవాట్లే మరణం ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆయుష్షు విషయంలో జీవనశైలినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని అధ్యయన ఫలితాలు గట్టిగా నొక్కి చెబుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని