కాంటాక్ట్‌ లెన్స్‌ల నుంచి సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు

ఎక్కువకాలం ఎండ ప్రభావానికి గురైతే కాంటాక్ట్‌ లెన్సుల నుంచి సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు రాలుతున్నాయని నాన్‌జింగ్‌, హోహై యూనివర్సిటీల పరిశోధకులు గుర్తించారు. మొత్తం ఆరు రకాల కాంటాక్ట్‌ లెన్సుల మీద చేసిన అధ్యయనంలో ఇది బయటపడింది

Published : 20 Jun 2023 01:30 IST

ఎక్కువకాలం ఎండ ప్రభావానికి గురైతే కాంటాక్ట్‌ లెన్సుల నుంచి సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు రాలుతున్నాయని నాన్‌జింగ్‌, హోహై యూనివర్సిటీల పరిశోధకులు గుర్తించారు. మొత్తం ఆరు రకాల కాంటాక్ట్‌ లెన్సుల మీద చేసిన అధ్యయనంలో ఇది బయటపడింది. కంట్లో ధరించినప్పుడు క్షీణించే తీరును తెలుసుకోవటానికి కాంటాక్ట్‌ లెన్సులను నీటిలో నిల్వ చేశారు. ఎండ మాదిరిగా లైటు వెలుగును ప్రసరింపజేశారు. ప్రతి 10 గంటలకోసారి నీటితో కడిగారు. నెల నుంచి మూడు నెలల పాటు ఎండ ప్రభావంతో సమానమైన వెలుగుకు గురిచేశాక కాంటాక్ట్‌ లెన్సులను నిల్వ చేసిన నీటిని నిశితంగా విశ్లేషించారు. మూడు నెలలకు సమానమైన ఎండ ప్రభావానికి గురైతే సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువుల సంఖ్య పెరుగుతున్నట్టు గుర్తించారు. దీని ఆధారంగా- రోజుకు 10 గంటల చొప్పున ధరిస్తే ఏటా 90వేల సూక్ష్మ ప్లాస్టిక్‌ పదార్థాలు విడుదలయ్యే అవకాశముందని అంచనా వేశారు. అయితే ఇవి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది మాత్రం ప్రస్తుతానికి స్పష్టంగా బయట పడలేదు. కానీ దీనిపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని