దోమ కుడితే దురదేల?

దోమ కుట్టిన చోట దురద పెడుతుంది కదా. వెంటనే గోకుతాం. ఇది దురదను తగ్గించకపోగా మరింత పెంచుతుంది! గోకినప్పుడు శరీరం హిస్టమిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది దురదను ఇంకాస్త పెంచుతుంది.

Published : 20 Jun 2023 01:32 IST

దోమ కుట్టిన చోట దురద పెడుతుంది కదా. వెంటనే గోకుతాం. ఇది దురదను తగ్గించకపోగా మరింత పెంచుతుంది! గోకినప్పుడు శరీరం హిస్టమిన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది దురదను ఇంకాస్త పెంచుతుంది. గోకిన చోట గీసుకుపోతే చేతికి ఉన్న బ్యాక్టీరియా దానికి అంటుకొని ఇన్‌ఫెక్షన్‌ (సెల్యులైటిస్‌) తలెత్తొచ్చు కూడా. అరుదుగానే అయినా కొందరికి దోమల లాలాజలం పడక, అలర్జీకి దారితీయొచ్చు. దీంతో పొక్కులు, దద్దుర్లు, చర్మం రంగు మారటం వంటివీ తలెత్తొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని