ఆస్ప్రిన్‌తో వృద్ధుల్లో రక్తహీనత ముప్పు

గుండెజబ్బు ముప్పు గలవారికి వైద్యులు స్వల్ప మోతాదు ఆస్ప్రిన్‌ వేసుకోవాలని సూచిస్తుంటారు. ఇది గుండెపోటు, పక్షవాతం నివారణకు తోడ్పడుతుంది. అయితే దీంతో రక్తస్రావమయ్యే ప్రమాదం లేకపోలేదు.

Published : 27 Jun 2023 01:18 IST

గుండెజబ్బు ముప్పు గలవారికి వైద్యులు స్వల్ప మోతాదు ఆస్ప్రిన్‌ వేసుకోవాలని సూచిస్తుంటారు. ఇది గుండెపోటు, పక్షవాతం నివారణకు తోడ్పడుతుంది. అయితే దీంతో రక్తస్రావమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇదొక్కటే కాదు.. దీర్ఘకాలం తక్కువ మోతాదు ఆస్ప్రిన్‌ వాడే వృద్ధులకు రక్తహీనత ముప్పూ 20% వరకు పెరుగుతున్నట్టు మోనాష్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. వీరిలో హిమోగ్లోబిన్‌, ఐరన్‌ను మోసుకెళ్లే ఫెరిటిన్‌ మోతాదులు వేగంగా తగ్గుతుండటం గమనార్హం. ముఖ్యంగా 70 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసువారికి ఈ ముప్పు పొంచి ఉంటోంది. మామూలుగానే వృద్ధులకు రక్తహీనత తలెత్తే అవకాశముంటుంది. దీంతో నిస్సత్తువ, కుంగుబాటు లక్షణాలు, మతిమరుపు వంటివి వేధిస్తుంటాయి. ఆస్ప్రిన్‌ వాడకంతో రక్తహీనత ముప్పు మరింత పెరుగుతున్న నేపథ్యంలో వీరిని తరచూ పరీక్షిస్తుండాలని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ప్రిన్‌తో తీవ్ర సమస్యలైన గుండెపోటు, పక్షవాతం ముప్పులు తగ్గుతాయి కాబట్టి డాక్టర్‌ సలహా లేకుండా వీటిని మార్చటం గానీ మానెయ్యటం గానీ తగదనీ సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని