కొలెస్ట్రాల్‌ తగ్గేదెలా?

రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉందా? మందులేసుకోవటానికి వెనకాడుతున్నారా? అయితే ఆహార, వ్యాయామ నియమాలను ప్రయత్నించి చూడండి.

Published : 12 Sep 2023 00:43 IST

రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉందా? మందులేసుకోవటానికి వెనకాడుతున్నారా? అయితే ఆహార, వ్యాయామ నియమాలను ప్రయత్నించి చూడండి.

  • కొద్ది కిలోలు ఎక్కువ బరువున్నా కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరుగుతాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఏరోబిక్‌ వ్యాయామాలు.. అంటే నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటివి చేయాలి.  
  • నూనె వాడకం తగ్గించుకోవాలి. నెలకు అరలీటరు కన్నా మించనీయొద్దు. కుటుంబంలో నలుగురుంటే నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ నూనె వాడొద్దన్నమాట. చిరుతిళ్లు మానెయ్యాలి. వనస్పతి వంటి ట్రాన్స్‌ ఫ్యాట్స్‌కు దూరంగా ఉండాలి.
  • నీటిలో కరిగే పీచుతో కూడిన పదార్థాలు.. బార్లీ, అవిసె గింజలు, పచ్చి బఠానీల వంటి పప్పులు.. బీన్స్‌, ఎండు అంజీరా, ఖర్జూరం, బ్రోకలీ, క్యాబేజీ, చిలగడ దుంప, బత్తాయి, యాపిల్‌, క్యారెట్‌, మొక్కజొన్న వంటివి తినాలి.
  • మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. వారానికి కనీసం మూడు సార్లయినా యోగా, ధ్యానం చేయటం మంచిది.
  • పొగ అలవాటుంటే మానెయ్యాలి. పొగ మానేస్తే మంచి కొవ్వు మోతాదులు పెరుగుతాయి. అదీ చాలా త్వరగా.

-ఇలాంటి జాగ్రత్తలతో మూడు నెలలు దాటినా ఎలాంటి ఫలితం కనిపించకపోతే వెంటనే మందులు వేసుకోవటం ఆరంభించాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని