స్తంభన లోపమా?

వయసు మీద పడుతున్నకొద్దీ మగవారిలో అంగం అంతగా గట్టిపడకపోవటం తరచూ చూసేదే. హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి స్తంభన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంటాయి.

Published : 26 Sep 2023 01:13 IST

యసు మీద పడుతున్నకొద్దీ మగవారిలో అంగం అంతగా గట్టిపడకపోవటం తరచూ చూసేదే. హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి స్తంభన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంటాయి. 40-70 ఏళ్ల వారిలో దాదాపు 52% మంది స్తంభన లోపంతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రతి 10 మందిలో ఒకరికిది దీర్ఘకాల సమస్యగానూ పరిణమిస్తోంది. వయసు మీద పడుతున్నకొద్దీ తలెత్తే కొన్ని సమస్యలు అంగం గట్టిపడటంలో ఇబ్బందులు సృష్టించొచ్చు. కొన్నిసార్లు స్తంభన లోపమూ ఇతరత్రా సమస్యలకు సంకేతం కావొచ్చు. నిజానికి గుండె జబ్బుతో ముడిపడిన రక్త ప్రసరణ సమస్య మూలంగానే స్తంభన లోపం తలెత్తుతుంటుంది. అధిక రక్తపోటుతో పాటు అధిక కొలెస్ట్రాల్‌, మధుమేహం, పొగ తాగటం వంటివన్నీ రక్తనాళాలు గట్టిపడేలా, లోపలి మార్గం సన్నబడేలా చేస్తాయి. దీంతో అంగానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే- గుండె పోటు దాడి చేయటానికి మూడు నుంచి ఐదేళ్ల ముందే స్తంభన లోపం తలెత్తుతుండటం. కాబట్టి స్తంభన లోపం లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయకుండా గుండె ఆరోగ్యం మీద దృష్టి సారించటం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని