Bacteria: మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది!

పేగుల్లో బోలెడంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి, పోషకాలను గ్రహించుకోవటానికి తోడ్పడతాయి.

Updated : 10 Oct 2023 01:20 IST

పేగుల్లో బోలెడంత మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి మనం తిన్న ఆహారం జీర్ణం కావటానికి, పోషకాలను గ్రహించుకోవటానికి తోడ్పడతాయి. ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, విటమిన్‌ బి6, విటమిన్‌ బి12 వంటి విటమిన్ల తయారీకీ సాయం చేస్తాయి. రోగనిరోధక శక్తినీ ఉత్తేజితం చేస్తాయి. అందుకే మంచి బ్యాక్టీరియాను కాపాడుకోవటం చాలా ముఖ్యం. యాంటీబయాటిక్‌ మందులతో విరేచనాలు పట్టుకున్నవారికి, పేగుపూత వంటి సమస్యలు గలవారికి డాక్టర్లు ప్రొబయాటిక్స్‌ వేసుకోవాలనీ సూచిస్తుంటారు. ఇవి మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. అలర్జీలు, కుంగుబాటు (డిప్రెషన్‌) సమస్యలతో బాధపడేవారికీ మేలు చేస్తాయి. లాక్టోబాసిలస్‌ శక్తిమంతమైన ప్రొబయాటిక్‌. సహజంగా ఇది పెరుగులో ఉంటుంది. ఉదయం పరగడుపున 30 మి.లీ. పెరుగు తీసుకుంటే మంచి ప్రొబయాటిక్‌గా ఉపయోగపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని