రొమ్ముక్యాన్సర్‌లోనూ నొప్పి

రొమ్ముక్యాన్సర్‌ కణితులతో నొప్పి పుట్టదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. రొమ్ముక్యాన్సర్‌లోనూ నొప్పి కలగొచ్చు. ఇది కణితులు ఎక్కడ తలెత్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

Published : 17 Oct 2023 00:19 IST

రొమ్ముక్యాన్సర్‌ కణితులతో నొప్పి పుట్టదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. రొమ్ముక్యాన్సర్‌లోనూ నొప్పి కలగొచ్చు. ఇది కణితులు ఎక్కడ తలెత్తాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చాలా వేగంగా పెరిగే కణితులతో నొప్పి కలగొచ్చు. రొమ్ముల్లో ప్రత్యేకించి ఏదో ఒకచోట నొప్పి కలుగుతుంటే హెచ్చరిక సంకేతంగా భావించాలి. నిజానికి చాలామంది మహిళల్లో అప్పుడప్పుడు రొమ్మునొప్పి వచ్చి, పోతూ ఉంటుంది. ఇదేమీ క్యాన్సర్‌ లక్షణం కాదు. దీనికి చాలావరకు హార్మోన్ల హెచ్చుతగ్గులు, అతిగా కెఫీన్‌ తీసుకోవటం వంటివే కారణమవుతుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని