సంతానలేమికి ఇదీ కారణమే

మగవారిలో సంతానలేమికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. ఏసీటీఎల్‌7బి జన్యు మార్పు సైతం దీనికి కారణమవుతున్నట్టు యూనివర్సిటీ హాస్పిటల్‌ బాన్‌ పరిశోధకులు గుర్తించారు.

Published : 07 Nov 2023 01:13 IST

మగవారిలో సంతానలేమికి రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. ఏసీటీఎల్‌7బి జన్యు మార్పు సైతం దీనికి కారణమవుతున్నట్టు యూనివర్సిటీ హాస్పిటల్‌ బాన్‌ పరిశోధకులు గుర్తించారు. వృషణాల్లో నిరంతరం వీర్యకణాలు పుట్టుకొస్తుంటాయి. ఈ ప్రక్రియలో భాగంగా గుండ్రటి బీజకణాలు పొడవైన వీర్యకణాలుగా మారతాయి. తల, మధ్యభాగం, ఈదటానికి తోడ్పడే పొడవైన తోక ఏర్పడతాయి. ఇలా ఆకారం మారటానికి కొన్ని ప్రోటీన్లు అవసరం. వీటిల్లో ఒకటే ఏసీటీఎల్‌7బి. ఇది వీర్యకణం పరిపక్వమయ్యే సమయంలో మనుషులు, ఎలుకల్లో ప్రత్యేకంగా తయారవుతుంది. అందుకే వీర్యకణాల ఆకారంలో కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. దీన్ని గుర్తించటానికే జన్యు మార్పిడి చేసిన ఎలుకల మీద అధ్యయనం నిర్వహించారు. ఏసీటీఎల్‌7బి లేని ఎలుకల్లో వీర్యకణాల ఎదుగుదల ఆగినట్టు, బీజకణాలు గుండ్రంగానే ఉండిపోతున్నట్టు గుర్తించారు. మగవారిలో సంతానలేమికి ఏసీటీఎల్‌7బి జన్యు మార్పులు కారణమవుతున్నట్టు ఈ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని