అతి ఆలోచనకు మేలైన చికిత్స

కొందరు ఒకే విషయం గురించి అదేపనిగా ఆలోచిస్తుంటారు. యుక్తవయసు పిల్లల్లో ఇది ఎక్కువ. యుక్తవయసులోనే మెదడు పరిపక్వమవుతుంటుంది. అలవాట్లు ఏర్పడుతుంటాయి.

Published : 07 Nov 2023 01:44 IST

కొందరు ఒకే విషయం గురించి అదేపనిగా ఆలోచిస్తుంటారు. యుక్తవయసు పిల్లల్లో ఇది ఎక్కువ. యుక్తవయసులోనే మెదడు పరిపక్వమవుతుంటుంది. అలవాట్లు ఏర్పడుతుంటాయి. ఈ వయసులో మరీ అతిగా ఆలోచించే సమస్య నుంచి బయటపడేందుకు రుమినేషన్‌ ఫోకస్డ్‌ కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ (ఆర్‌ఎఫ్‌-సీబీటీ) తోడ్పడుతున్నట్టు బయటపడింది. మాటిమాటికీ కుంగుబాటుకు లోనయ్యే పెద్దవారికి ఈ చికిత్స మేలు చేస్తున్నట్టు ఇప్పటికే రుజువైంది. యుక్తవయసు పిల్లలకూ ఇది వర్తిస్తుందో లేదో తెలుసుకోవటానికి పరిశోధకులు ప్రయత్నించారు. ఆర్‌ఎఫ్‌-సీబీటీ తీసుకున్నవారిలో అతి ఆలోచనలకు కారణమయ్యే మెదడు భాగాల్లో నాడుల స్థాయిలో అనుసంధానాలు మారిపోతున్నాయని గుర్తించారు. వీడియో కన్సల్టేషన్‌ ద్వారానూ ఇది మంచి ఫలితం కనబరుస్తున్నట్టు తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని