కొవిడ్‌ కొత్త వైరస్‌

కొవిడ్‌-19 అంతమైందని అనుకుంటే పొరపడ్డట్టే. తాజాగా కొత్తరకం కొవిడ్‌ వైరస్‌ పుట్టుకొచ్చింది. దీని పేరు జేఎన్‌.1. ఇది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు కారణమవటమే కాదు, ప్రస్తుత టీకాలకు లొంగదు కూడా. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై ఆందోళన చెందుతున్నారు.

Published : 14 Nov 2023 00:01 IST

కొవిడ్‌-19 అంతమైందని అనుకుంటే పొరపడ్డట్టే. తాజాగా కొత్తరకం కొవిడ్‌ వైరస్‌ పుట్టుకొచ్చింది. దీని పేరు జేఎన్‌.1. ఇది తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు కారణమవటమే కాదు, ప్రస్తుత టీకాలకు లొంగదు కూడా. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై ఆందోళన చెందుతున్నారు. జేఎన్‌.1. వైరస్‌ రకాన్ని మూడు నెలల క్రితం లగ్జెంబర్గ్‌లో తొలిసారి గుర్తించారు. అనంతరం ఇంగ్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌, ఫ్రాన్స్‌, అమెరికా దేశాలకు వ్యాపించింది. ఇది ఎక్స్‌బీబీ1.5, హెచ్‌వీ.1 వంటి కొవిడ్‌ వైరస్‌ రకాలకు చెందినదే అయినా దీనిలో చాలా తేడాలు ఉన్నాయి. ఎక్స్‌బీబీ1.5 రకం వైరస్‌ ముల్లు ప్రొటీన్‌ మీద 41 మార్పులు సంభవించి, ఈ స్థితికి చేరుకుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అందుబాటులో ఉన్న కొవిడ్‌ టీకాలు దీన్ని నిలువరించలేవని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. దీని నుంచి కాపాడుకోవటానికి ఆధునీకరించిన కొవిడ్‌ టీకాలు అవసరమని అమెరికాకు చెందిన సీడీసీ చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని