పాదాలు కంపు కొడుతుంటే?

కొందరికి పాదాలు కంపు కొడుతుంటాయి. షూ, సాక్స్‌ తీయాలంటేనే ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం పాదాలకు చెమట పోయటం. ఇది చర్మం మీద బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది.

Published : 28 Nov 2023 02:21 IST

కొందరికి పాదాలు కంపు కొడుతుంటాయి. షూ, సాక్స్‌ తీయాలంటేనే ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం పాదాలకు చెమట పోయటం. ఇది చర్మం మీద బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. దుర్వాసనకు దారితీస్తుంది. అథ్లెట్స్‌ ఫుట్‌ వంటి ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లూ వాసనకు కారణమవుతాయి. చిన్న చిన్న జాగ్రత్తలు, చిట్కాలతో దీన్ని తేలికగానే వదిలించుకోవచ్చు.

  • బకెట్‌లో గోరు వెచ్చటి నీరు పోసి, అందులో కొద్దిగా వెనిగర్‌ కలపాలి. ఇందులో ఐదు నిమిషాల సేపు పాదాలను ఉంచాలి. తర్వాత తువ్వాలుతో శుభ్రంగా తుడుచుకోవాలి.
  •  రోజూ సాక్సు మార్చుకోవాలి. చెమç ఎక్కువగా పోసే వేడి వాతావరణం, వ్యాయామం చేయటం వంటి సందర్భాల్లో ఇంకాస్త త్వరగానూ సాక్స్‌ మార్చుకోవాలి.
  • రెండు జతల సాక్స్‌ కొనుక్కోవాలి. ఒకటి ఒకనాడు, మర్నాడు మరోటి వేసుకోవాలి. తీసిన జతను గాలికి ఆరెయ్యాలి. దీంతో అవి పూర్తిగా ఆరటానికి తగినంత సమయం లభిస్తుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందటం తగ్గుతుంది.
  •  తేమను పట్టి ఉంచేవి కాకుండా చెమటను పీల్చుకునే మందమైన, మృదువైన నూలు సాక్స్‌ లేదా స్పోర్ట్స్‌ సాక్స్‌ ఎంచుకోవాలి.
  •  వేడి వాతావరణంలో చెప్పులు ధరించటం మంచిది.
  •  బిగుతైన, తేమను పట్టి ఉంచే షూ వేసుకోవద్దు.
  • వీలుంటే చెమట పట్టకుండా, దుర్వాసన రాకుండా చూసే స్ప్రేను పాదాలకు చల్లుకోవచ్చు.
  •  పాదాలను యాంటీబ్యాక్టీరియా, యాంటీఫంగల్‌ సబ్బుతో శుభ్రం చేసుకోవటమూ మేలు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని