మనసు మీద ఫోన్‌ దెబ్బ

పిల్లల చేతికి స్మార్ట్‌ ఫోన్లు ఇస్తున్నారా? కాస్త జాగ్రత్త. ఇది మానసిక ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనంలో బయటపడింది.

Published : 12 Dec 2023 01:19 IST

పిల్లల చేతికి స్మార్ట్‌ ఫోన్లు ఇస్తున్నారా? కాస్త జాగ్రత్త. ఇది మానసిక ఆరోగ్యం మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు దక్షిణ కొరియాకు చెందిన హన్యాంగ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ అధ్యయనంలో బయటపడింది. ముఖ్యంగా రోజుకు నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లతో గడిపే యుక్తవయసు పిల్లలకు తీవ్ర నష్టం కలుగుతున్నట్టు వెల్లడైంది. ఇటీవల పిల్లల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరిగింది. ఇది మానసిక జబ్బులతో పాటు నిద్ర, కళ్లు, ఎముకలకు అంటుకునే కండరాల సమస్యలకూ దారితీస్తున్నట్టు భావిస్తున్నారు. వీటి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకోవటం మీదే పరిశోధకులు దృష్టి సారించారు. రోజుకు నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్‌ వాడేవారిలో ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, దురలవాట్లు ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. కాబట్టి పిల్లలు మరీ ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్లతో గడపకుండా చూసుకోవటం మంచిదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని