పళ్లు తోముకుంటే న్యుమోనియా దూరం

కొన్నిసార్లు ఆసుపత్రుల్లో చేరినప్పుడూ కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. వీటిల్లో ఒకటి న్యుమోనియా. ఆసుపత్రిలో చేరినవారిలో నూటికి ఒకరికిది వచ్చే అవకాశముంది.

Published : 26 Dec 2023 01:28 IST

కొన్నిసార్లు ఆసుపత్రుల్లో చేరినప్పుడూ కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. వీటిల్లో ఒకటి న్యుమోనియా. ఆసుపత్రిలో చేరినవారిలో నూటికి ఒకరికిది వచ్చే అవకాశముంది. కొందరికి ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. అయితే ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నప్పుడు రోజుకు రెండు సార్లు పళ్లు తోమితే న్యుమోనియా ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. అంతేకాదు.. అత్యవసర చికిత్స గదుల్లో ఉండాల్సిన సమయం, వెంటిలేటర్‌ అవసరం, ఐసీయూల్లో మరణించే అవకాశమూ తగ్గుతుండటం విశేషం. ముఖ్యంగా బయటి నుంచి ఆక్సిజన్‌ తీసుకుంటున్నవారు, వెంటిలేటర్‌ అమర్చినవారికిది ఎక్కువగా ఉపయోగపడుతున్నట్టు తేలింది. ఆసుపత్రిలో చేరినప్పుడు వచ్చే న్యుమోనియాకు చాలావరకు నోట్లోని సూక్ష్మక్రిములే కారణం. లాలాజలం పొరపాటున శ్వాస మార్గంలోకి వెళ్లినప్పుడు ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటాయి. పళ్లు తోమటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. మరణాలూ తగ్గుతుండటం ఆసక్తికర విషయమని పరిశోధకులు చెబుతున్నారు. న్యుమోనియా నివారణకు ఇది తేలికైన, చవకైన మార్గం కాగలదని సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని