కాఫీతో పరుగోత్సాహం!

అధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల నివారణకు, నియంత్రణకే కాదు.. శరీర సామర్థ్యాన్ని పెంచుకోవటానికీ చాలామంది పరుగెత్తుతుంటారు.

Published : 28 Feb 2023 00:39 IST

ధిక రక్తపోటు, మధుమేహం వంటి జబ్బుల నివారణకు, నియంత్రణకే కాదు.. శరీర సామర్థ్యాన్ని పెంచుకోవటానికీ చాలామంది పరుగెత్తుతుంటారు. పోలీసు ఉద్యోగాల వంటి వాటి కోసం ఫిట్‌గా ఉండటం తప్పనిసరి మరి. అందుకే కాస్త వేగంగా, ఎక్కువసేపు పరుగెత్తాలనీ ప్రయత్నిస్తుంటారు. ఇందుకు కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఇది శక్తిని, సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కాఫీ తాగిన 45 నిమిషాల తర్వాత పరుగు పందెం క్రీడాకారుల నైపుణ్యం 5% వరకు మెరుగవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అరటి పండూ మేలు చేస్తుంది. నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీంతో పొటాషియం కూడా దండిగా లభిస్తుంది. ఇది త్వరగా అలసిపోకుండా కాపాడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని