Nap: కునుకు తీస్తున్నారా... ఈ చిట్కాలు పాటిస్తే ఇంకా మంచిది!

Tips for Nap: ఉదయం పూట కునుకు తీసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే మరింత మేలు కలుగుతుంది. 

Updated : 03 Mar 2024 15:36 IST

పగటిపూట కాసేపు కునుకు తీయటం మనలో చాలామందికి అలవాటే. ఇది పని అలసటను దూరం చేసి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మెదడుకు చురుకుదనాన్ని తెచ్చిపెడుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే దీంతో మరింత మేలు కలిగేలా చూసుకోవచ్చు.

  • ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ముఖ్యంగా పనులు చేసే సమయంలో దీని మరవొద్దు. చాలాసేపు కునుకు తీస్తే చాలాసేపటి వరకు మగతగా అనిపిస్తుంది. ఇది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి పగటిపూట 10-20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోవద్దు.
  • సెలవురోజుల్లోనూ గంట కన్నా ఎక్కువసేపు కునుకు తీయొద్దు. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది.
  • చీకటి పడుతుండగా కునుకు తీయకపోవటమే మంచిది. రాత్రిపూట పడుకునే సమయానికి దగ్గర్లో కునుకు తీస్తే ఆనక నిద్ర పట్టకపోవచ్చు.
  • నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం మేలు. సాధారణంగా ఈ సమయంలో మన జీవగడియారం నిద్ర వస్తున్న భావన కలగజేస్తుంటుంది.
  • నిద్రలేమి, నిద్ర మధ్యలో శ్వాసకు అడ్డంకి తలెత్తటం వంటి సమస్యలు గలవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది.
  • కునుకు పట్టినపుడు కలలు కూడా వస్తుంటే.. రాత్రిపూట సరిగా నిద్రపోవటం లేదనే అర్థం. ఇలాంటివాళ్లు రాత్రిపూట తగినంత నిద్రపోయేలా చూసుకోవాలి. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు