బొమ్మ ఎలా గీయాలో చూపిస్తా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బాగున్నారా! నేను మీ చిన్నూను. చాలా రోజులైంది కదా.. మిమ్మల్ని పలకరించి. సారీయే! ఏం చేస్తాం.. చెప్పండి. బయట లాక్‌డౌన్‌ నడుస్తోంది కదా! అందుకే రాలేకపోయాను. నాకు ఇన్నాళ్లకు అవకాశం దొరికింది. మీరు మాత్రం వీలుంటే ఇంకొన్నాళ్లు అసలు బయటకు వెళ్లకండి. ఇన్ని రోజులు ఇంట్లో ఉండీ ఉండీ.. మీకు కాస్త బోర్‌ కొడుతోంది కదూ! అందుకే ఈ రోజు ఓ డ్రాయింగ్‌ మీకు నేర్పిద్దామని ఇలా వచ్చాను. నేర్చేసుకుంటారా మరి!

Updated : 26 May 2020 00:54 IST

ఏమేం కావాలంటే..

1. పిస్తా పెంకులు 2. రంగులు, బ్రష్‌లు

3. డ్రాయింగ్‌ చార్టు 4. జిగురు(గమ్‌)

ఎలా చేయాలంటే..

* ముందుగా పిస్తా పెంకులు తీసుకోండి. వాటికి ఉబ్బెత్తుగా ఉన్నవైపు మీకు నచ్చిన రంగులు వేసుకోండి.

* ఎరుపు, నీలం, పసుపు, ఆరెంజ్‌, బంగారం వర్ణాలైతే బాగుంటాయి. ● రంగులు వేసిన తర్వాత వాటిని అలా ఆరనివ్వండి.

* ఇప్పుడు డ్రాయింగ్‌ చార్టును తీసుకోండి.

* దాని మీద పెయింటింగ్‌ బ్రష్‌తో చెట్టు, కొమ్మల ఆకారం వేయండి.

* మీకు డ్రాయింగ్‌ సరిగా రాకుంటే.. ముందు పెన్సిల్‌తో గీసుకుని తర్వాత పెయింటింగ్‌ బ్రష్‌తో గీయండి. ●

* మీకు ఇలా కూడా గీయడం రాదనుకోండి... బాధపడకండి.. మరేం ఫర్వాలేదు.. ఎంచక్కా స్కెచ్‌లతోనే గీసుకోండి.

* ఇంకేం ఇప్పుడు చెట్టు సిద్ధమై పోయింది. ●

* ఇక చివరల్లో మనం ఇది వరకే రంగులు వేసి సిద్ధంగా పెట్టుకున్న పిస్తా పెంకుల్ని గమ్‌సాయంతో కొమ్మలకు అక్కడక్కడ అతికించండి. ఇవి పక్షులన్నమాట.

* ఆరిన తర్వాత పిస్తా పెంకులకు పెయింట్‌తో చిన్న చుక్కలు పెట్టండి. ఇవి పక్షుల కళ్లు!

* తర్వాత వాటికి ముక్కులూ గీయండి.

* భలే భలే..! బొమ్మ సిద్ధమై పోయింది!

* దీన్ని షోకేస్‌లోనో.. మీ స్టడీరూంలోనో పెట్టుకోండి!

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని