నవ్వుల్‌.. నవ్వుల్‌..!

అను: నాన్నా నాన్నా.. నాకు పరీక్షలో 98 మార్కులు వచ్చాయి..

Published : 15 Jun 2022 00:29 IST

అన్నీ కలిపి..

అను: నాన్నా నాన్నా.. నాకు పరీక్షలో 98 మార్కులు వచ్చాయి..
నాన్న: నా బంగారం రా నువ్వు.. ఏ సబ్జెక్టులో..?

అను: ఏ సబ్జెక్టు ఏంటి నాన్నా.. అన్నింట్లో కలిపి..
నాన్న: ఆ..!!

టైం కలిసొస్తుందనీ...

అంకుల్‌ : చిన్నూ..ఎక్కడికెళ్తున్నావు?
చిన్ను : సినిమాకు అంకుల్‌..

అంకుల్‌ : మరి చేతిలో ఆ పుస్తకం ఎందుకు?
చిన్ను : మొన్ననే బడులు తెరిచారు కదా.. సమయం అస్సలు వృథా చేయకుండా, మొదటి నుంచే ప్లాన్‌ ప్రకారం చదువుకోవాలని టీచర్‌ చెప్పారు అంకుల్‌..

అంకుల్‌ : ఆ.. అయితే?
చిన్ను : ఇంటర్వెల్‌లో ఖాళీనే కదా.. టైం వేస్ట్‌ కాకుండా, అప్పుడు చదువుకుందామని బుక్‌ తీసుకెళ్తున్నా..

ఆ మాత్రం బాధ ఉండదా!

టీచర్‌ : రాజూ.. ఏంటి దిగులుగా కూర్చున్నావు?
రాజు : అవును టీచర్‌.. మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లో కోప్పడ్డారు..

టీచర్‌ : అందుకే, బాగా చదవాలి మరి..
రాజు : ‘సున్నా’ను కనిపెట్టిన వారినేమో మేధావి అని అంటున్నారు.. పరీక్షల్లో అదే ‘సున్నా’ తెచ్చుకున్న నన్నేమో తిడుతున్నారు.. ఇదేం న్యాయం టీచర్‌..!! 

టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని