నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : టిల్లూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?

Published : 06 Nov 2022 00:06 IST

గొప్ప ఆశయం..

టీచర్‌ : టిల్లూ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
టిల్లు : రాజకీయ నేత అవుతా టీచర్‌..

టీచర్‌ : ఎందుకు?
టిల్లు : చదువు చెప్పే వారికి ఇచ్చినట్లుగానే, చదువుకునే వాళ్లకీ జీతాలు ఇవ్వాలని చట్టం తీసుకొస్తా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అదీ సంగతి!

బామ్మ : విక్కీ.. ఎందుకులా చెల్లితో రోజూ గొడవపడుతుంటావు?
విక్కి : నేను కాదు బామ్మా.. చెల్లె..

బామ్మ : ఇద్దరూ కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ గొడవా ఉండదు కదా..!
విక్కి : వద్దు బామ్మా.. అలా ఆలోచించిన ప్రతిసారీ చెల్లి మాటే నెగ్గుతోంది..

బామ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని