నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Published : 11 Jun 2023 00:15 IST

నిజమే మరి..

అంకుల్‌ : ఏంటి పంకజ్‌.. అక్వేరియం వైపే చూస్తూ ఏదో ఆలోచిస్తున్నావు?

పంకజ్‌ : వచ్చే జన్మలోనైనా చేపలా పుట్టాలని ఉంది అంకుల్‌.. ..  

అంకుల్‌ : ఏ.. ఎందుకు?

పంకజ్‌ : అవి అసలు స్నానం చేయనవసరం లేదు.. వాటికి జలుబు కూడా చేయదు..  

అంకుల్‌ : ఆ..!!

భలే అదృష్టం..

రింకి : పింకీ.. నిజంగా అదృష్టమంటే చంద్రుడిదే..

పింకి : ఎందుకలా?

రింకి : ఈ ఎండలూ, ఉక్కపోత బాధ ఉండనే ఉండదు.. ఎంచక్కా రాత్రిళ్లే వచ్చి, తెల్లవారేసరికి మాయమవుతాడు కాబట్టి..

పింకి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని