నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 13 Jun 2023 00:57 IST

కిరణ్‌.. బుద్ధిమంతుడు..

టీచర్‌ : ఏంటి కిరణ్‌.. ఆకాశంలోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
కిరణ్‌ : మన పేరును మనమే పెట్టుకునే అవకాశం ఉంటే బాగుండేది టీచర్‌..
టీచర్‌ : ఏ.. ఎందుకలా? ఇప్పుడేమైంది?
కిరణ్‌ : నన్ను అందరూ అల్లరి పిల్లవాడు అంటున్నారు..
టీచర్‌ : ఆ.. అయితే?
కిరణ్‌ : మనకు అవకాశం ఉంటే.. నా పేరును ‘బుద్ధిమంతుడు’ అని పెట్టుకునేవాడిని టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


అవును.. ఎంత కష్టమో!

పింకి : సూర్యుడికి అన్నం తినిపించడానికి వాళ్లమ్మ ఎంత కష్టపడుంటుందో కదమ్మా..  
అమ్మ : అదేంటి?
పింకి : నాకూ, తమ్ముడికీ చందమామను చూపించే తినిపించావు కదా..
అమ్మ : ఆ.. అవును..
పింకి : మరి.. సూర్యుడు వచ్చే సమయంలో చందమామ ఉండడు కదా..
అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని