నవ్వుల్‌... నవ్వుల్‌..!

అమ్మ : చింటూ.. చెల్లి అలా గుక్కపట్టి ఏడుస్తుందేంటి.. ఏమైనా అన్నావా?చింటు : నేనేం అనలేదమ్మా..

Published : 17 Jun 2023 01:07 IST

తరగతి మారినా..
అమ్మ : చింటూ.. చెల్లి అలా గుక్కపట్టి ఏడుస్తుందేంటి.. ఏమైనా అన్నావా?
చింటు : నేనేం అనలేదమ్మా..
అమ్మ : మరెందుకు ఏడుస్తుంది?

చింటు : బడిలో కొత్తగా ఇచ్చిన పుస్తకాల్లో అన్నీ తనకు తెలియని పాఠాలే ఉన్నాయట.. పాతవే కావాలంటోంది మరి..
అమ్మ : ఆ..!!


ఎంత అన్యాయం?
మావయ్య : ఏంటి పింకీ.. బడి నుంచి రాగానే అలా దిగులుగా కూర్చున్నావు?  
పింకి : మరేం లేదు మావయ్యా.. ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు..  
మావయ్య : ఏం జరిగిందో చెప్పు..

పింకి : సున్నాను కనిపెట్టిన వారినేమో శాస్త్రవేత్త అని పొగుడుతున్నారు.. అదే సున్నా మార్కులు తెచ్చుకున్న నన్నేమో                   అందరూ తిడుతున్నారు..
మావయ్య : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని