నవ్వుల్‌.. నవ్వుల్‌.!

 ఏంటి చంటీ.. లక్ష రూపాయలు అని డిక్టేషన్‌ చెబితే, నువ్వు ఒకటి పక్కన ఒకటే సున్నా వేశావు?

Updated : 20 Jun 2023 05:14 IST

తెలివైన విద్యార్థి..

టీచర్‌ : ఏంటి చంటీ.. లక్ష రూపాయలు అని డిక్టేషన్‌ చెబితే, నువ్వు ఒకటి పక్కన ఒకటే సున్నా వేశావు?
చంటి : మొన్న మీరే కదా టీచర్‌.. అయిదు లక్షలు అంటే.. అయిదు పక్కన అయిదు సున్నాలుంటాయని అన్నారు..
టీచర్‌ : ఆ అవును..
చంటి : మరి ఆ లెక్కన చూసుకుంటే, లక్ష అంటే.. ఒకటి పక్కన ఒకటే సున్నా ఉంటుంది కదా టీచర్‌..
టీచర్‌ : ఆ..!!


ఇప్పటికైనా తెలిసిందా..!

మావయ్య: ఏంటి విక్కీ.. అలా చొక్కా లేకుండానే ఇంట్లోకీ బయటకూ తిరుగుతున్నావు?
విక్కి : మరేం లేదు మావయ్యా.. చెల్లి అల్లరి చేసినా ‘నీకు సిగ్గు లేదురా..’ అని బామ్మ నన్నే తిడుతుంటేనూ..! నిజంగా నాకు సిగ్గు ఉందో.. లేదో తెలుసుకుందామని ఇలా చెక్‌ చేసుకుంటున్నా!
మావయ్య : ఆ.!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని