నవ్వుల్...నవ్వుల్...!

Updated : 22 Jun 2023 06:23 IST

కష్టమే మరి..

 

టీచర్‌ : పింకీ.. సెలవుల్లో ఏం నేర్చుకున్నావు నువ్వు?

పింకి : ఒక విషయం మాత్రం తెలుసుకున్నా టీచర్‌..

టీచర్‌ : ఏంటది?

పింకి : నాలాంటి పిల్లల్ని నిద్రపుచ్చడం ఎంత కష్టమో, ఉదయాన్నే నిద్ర లేపడమూ అంతే కష్టమని..

టీచర్‌ : ఆ..!!

ఆలోచన అప్పుడే..

అంకుల్‌ : హరీ.. వాన కోటును ఎవరు కనిపెట్టారో తెలుసా?

హరి : ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ, ఎప్పుడు కనిపెట్టారో మాత్రం చెప్పగలను అంకుల్‌..

అంకుల్‌ : ఎప్పుడు?

హరి : వానాకాలంలోనే..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని