నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 23 Jun 2023 05:16 IST

అదే ముఖ్యం మరి!

టీచర్‌ : చింటూ.. నీకు మార్కులు తక్కువ వచ్చినట్టు మీ నాన్న గారికి మెసేజ్‌ పెట్టినా.. ఏమీ స్పందించలేదేంటి?

చింటు :  ‘బ్యాటరీ లో’ అనే మెసేజ్‌కి తప్ప, వేరే దేనికీ మా నాన్న స్పందించరు టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

నిజమే కదా..

బామ్మ : టిల్లూ.. రోజూ బాదం పప్పులు తింటే ఏమవుతుంది?

టిల్లు : డబ్బా ఖాళీ అవుతుంది బామ్మా..

బాధ ఉంటుంది కదా..

అంకుల్‌ : లిల్లీ.. నువ్వు బాధపడిన సందర్భం ఏదైనా ఉందా?

లిల్లి : ఎందుకు లేదంకుల్‌.. పరీక్షలో నేనేమీ రాయలేకపోతున్నాననే దాని కంటే, నా పక్క బెంచీలోనే కూర్చునే మీ అమ్మాయి డాలీ అడిషనల్‌ మీద అడిషనల్‌ షీట్స్‌ తీసుకున్నప్పుడు ఎక్కువ బాధపడతాను..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని