నవ్వుల్‌...! నవ్వుల్‌...!

గుండ్రంగా తిరగాలా..!

Published : 09 Jul 2023 00:05 IST

గుండ్రంగా తిరగాలా..!

నాన్న: ఏంటి చింటూ.. ఫోన్‌ పట్టుకుని అలా గుండ్రంగా తిరుగుతున్నావు?

చింటు: చాక్లెట్‌ కోసమని అమ్మకి ఫోన్‌ చేస్తే, బిజీగా ఉంది.. తిరిగి మళ్లీ కాల్‌ చేయమని వస్తోంది నాన్నా..

నాన్న: ఆఁ..!

అదే మ్యాజిక్కు..

టీచర్‌ : పిల్లలూ.. కథల గురించి ఎవరికైనా ఏమైనా తెలుసా?  

హరిణి : నాకు తెలుసు టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. ఏంటో చెప్పు?

హరిణి : నిద్రపుచ్చేందుకు అమ్మ నాకు కథలు చెబితే.. బడి ఎగ్గొట్టేందుకు అమ్మకు నేను కథలు చెబుతా..  

టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని