నవ్వుల్‌.. నవ్వుల్‌.!

సన్నీ..! నీకు దారిలో పది రూపాయలు దొరికాయి, మీ అమ్మ ఇంకో ఐదు రూపాయలు ఇచ్చింది.

Published : 21 Jul 2023 01:16 IST

లెక్కల చిక్కు!

టీచర్‌: సన్నీ..! నీకు దారిలో పది రూపాయలు దొరికాయి, మీ అమ్మ ఇంకో ఐదు రూపాయలు ఇచ్చింది. మొత్తం ఇప్పుడు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నట్లు?

సన్ని: పది రూపాయలు టీచర్‌

టీచర్‌: అదేంటి..! మిగతా ఐదు రూపాయలు?

సన్ని: మా అమ్మ డబ్బులు ఇవ్వదుగా టీచర్‌..!

టీచర్‌: ఆఁ..!

ఘన చరిత్ర..!

టీచర్‌: టింకూ.. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెబుతావు కదూ..!

టింకు: తప్పకుండా టీచర్‌.

టీచర్‌: ఘన చరిత్ర కలిగిన భవనాలు ఏవో చెప్పు?

టింకు: లైబ్రరీలు టీచర్‌. అందులోనేగా.. ఎక్కువ చరిత్ర పుస్తకాలుంటాయి.

టీచర్‌: ఆఁఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని