నవ్వుల్‌... నవ్వుల్‌..!

టీచర్‌: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు చింటూ?, చింటు: మంచోణ్ని మాత్రం అవను టీచర్‌.

Published : 01 Aug 2023 00:06 IST

ఓరి.. నాయనో!

టీచర్‌: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు చింటూ?
చింటు: మంచోణ్ని మాత్రం అవను టీచర్‌.
టీచర్‌: అదేంటి?
చింటు: మంచోళ్లకే దేవుడు ఎక్కువ కష్టాలు పెడతాడట కదా టీచర్‌. మా అమ్మమ్మ అంటుంటే విన్నా. అందుకే నేను మంచోణ్ని మాత్రం అవ్వను.
టీచర్‌: ఆఁ!!

ఎంత గొప్ప ఆలోచనో!

నాన్న: బంటీ.. ఎటు వెళ్తున్నావు?
బంటి: క్రికెట్‌ ఆడుకోవడానికి నాన్నా..
నాన్న: మరి చేతిలో ఆ పుస్తకం ఏంటి?
బంటి: ఫీల్డింగ్‌ చేస్తూ చదువుకుందామని!
నాన్న: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని