నవ్వుల్‌.. నవ్వుల్‌...!

అమ్మ: ఏంటి చింటూ..! ఎందుకు ఏడుస్తున్నావు?

Updated : 09 Aug 2023 03:11 IST

టీచర్‌ వస్తున్నారు..!

అమ్మ: ఏంటి చింటూ..! ఎందుకు ఏడుస్తున్నావు?

చింటు: మా టీచర్‌ జ్వరంగా ఉందని నెల రోజుల నుంచి స్కూల్‌కి రావట్లేదమ్మా..!

అమ్మ: ఇప్పుడు ఆవిడకి జ్వరం ఎక్కువైందని ఏడుస్తున్నావా..!

చింటు: కాదమ్మా..! రేపటి నుంచి ఆవిడ మళ్లీ స్కూల్‌కి వస్తున్నారంటా..!

అమ్మ: ఆఁ..!

నిశ్శబ్దం..!

టీచర్‌: పిల్లలూ..! ఎప్పుడు చూసినా ఈ గోలేంటి..నిశ్శబ్దంగా ఉండాలని నిన్న చెప్పాగా..!

విద్యార్థులు: అలాగే ఉంటున్నాం టీచర్‌..

టీచర్‌: మాట్లాడుకుంటూనే నిశ్శబ్దంగా ఉన్నాం అంటున్నారేంటి..?

విద్యార్థులు: అంటే.. టీచర్‌ నిశ్శబ్దంగా ఎలా ఉండాలో చర్చించుకుంటున్నాం..!

టీచర్‌: ఆఁ..!

ఎక్కడ దొరుకుతాయి..!

టీచర్‌: పట్టుదల, దృఢసంకల్పం ఉండే ఎంత కష్టమైన పని అయినా ఇట్టే చేసేయొచ్చు..

బంటి: పరీక్షలు రాయడం చాలా కష్టంగా ఉంది టీచర్‌..

టీచర్‌: అయితే పట్టుదలతో చదువు దృఢసంకల్పంతో ఉండు పరీక్షలు బాగానే రాస్తాం.

బంటి: అవి ఎక్కడ ఉంటాయో చెప్తే వెంటనే వెళ్లి తెచ్చేసుకుంటాను టీచర్‌..

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని