నవ్వుల్‌... నవ్వుల్‌..!

టిల్లు : విక్కీ.. నిన్న నీ స్కూల్‌ బ్యాగ్‌ను బ్యాంకుకు తీసుకెళ్లి, లోన్‌ ఇస్తారా అని అడిగావట?

Published : 10 Aug 2023 00:42 IST

పెద్ద ప్లానే..!

టిల్లు : విక్కీ.. నిన్న నీ స్కూల్‌ బ్యాగ్‌ను బ్యాంకుకు తీసుకెళ్లి, లోన్‌ ఇస్తారా అని అడిగావట?

విక్కి : అవును టిల్లూ.. మొన్న మా మావయ్య లోన్‌ తీసుకొని కొన్న బైక్‌కి వాయిదాలు సరిగ్గా కట్టడం లేదని, బ్యాంకు వాళ్లు వచ్చి బండిని తీసుకెళ్లిపోయారు..

టిల్లు : ఆ.. అయితే?

విక్కి : అలా నా బ్యాగ్‌ కూడా తీసుకెళ్లిపోతే.. బడికి వెళ్లే బాధ తప్పుతుందనీ..

టిల్లు : ఆఁఁ!!

భలే తగ్గింపు!

పింకి : అంకుల్‌ అంకుల్‌.. నాకో సబ్బు ఇవ్వండి.

దుకాణదారు : ఇదిగోమ్మా తీసుకో.. 30 రూపాయలివ్వు.

పింకి : ఏం.. తగ్గదా అంకుల్‌!

దుకాణదారు : వాడుతూ ఉంటే అదే  తగ్గుతుందమ్మా..

పింకి : ఆఁఁ!!

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని