నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అంతేనా..!

Published : 12 Aug 2023 00:09 IST

అంతేనా..!

పవన్‌ : అరే శ్రవణ్‌.. ఈరోజు ఇంత చలిగా ఉందేంట్రా?
శ్రవణ్‌ : సూర్యుడు ఇంకా బయటకు రాలేదు కదా..!
పవన్‌ : ఎందుకు రాలేదంటావ్‌?
శ్రవణ్‌ :చలిగా ఉందని నువ్వే అంటున్నావు కదా.. మరి, అంత చల్లదనంలో సూర్యుడిని వాళ్లమ్మ బయటకు ఎలా పంపుతుంది?
పవన్‌ : ఆ..!!


న్యాయం చేయాలి మరి!

మావయ్య : ఏంటి చింటూ.. రెయిన్‌ కోటు వేసుకొని మరీ స్నానం చేస్తున్నావట?
చింటు : అవును మావయ్యా.. నేను కోటు కొన్నాక, ఒక్కసారి కూడా వర్షం పడలేదు మరి..
మావయ్య : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని