నవ్వుల్‌.. నవ్వుల్‌.!

వినయ్‌: అరెయ్‌ విక్రమ్‌.. మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా?

Published : 16 Aug 2023 00:03 IST

పందెం అంటే ఇదే..!

వినయ్‌: అరెయ్‌ విక్రమ్‌.. మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా?

విక్రమ్‌: సరే.. ఎక్కడివరకో చెప్పు?

వినయ్‌: మా ఇంటికి వరకూ..

విక్రమ్‌: మరి నాకు మీ ఇల్లు తెలియదు కదా..?

వినయ్‌: అయితే, నేను ముందు వెళ్తుంటా.. నువ్వు నా వెనకే పరుగెత్తుకుంటూ రా..


పాయింటే..

నాన్న: ఏంటి పింకీ.. దేనిగురించో ఆలోచిస్తున్నట్లున్నావు?

పింకి: అవును నాన్నా..

నాన్న: ఏంటో చెప్పు..?

పింకి: బొంబాయి పేరు ముంబయిగా మారినప్పుడు, బొంబాయి రవ్వ పేరు కూడా ముంబయి రవ్వగా మారాలి కదా..?

నాన్న: ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని