నవ్వుల్‌... నవ్వుల్‌..!

బంటీ.. నిన్నో ప్రశ్న అడుగుతాను.. సరైన సమాధానం చెప్తావా..?

Published : 18 Aug 2023 00:16 IST

లెక్క సరిపోయింది..

చింటు: బంటీ.. నిన్నో ప్రశ్న అడుగుతాను.. సరైన సమాధానం చెప్తావా..?

బంటి: తప్పకుండా చెప్తాను చింటూ..

చింటు: గ్రహాలు మొత్తం ఎన్ని?

బంటి: పదకొండు..

చింటు: అదెలా?

బంటి: ఆగ్రహం, నిగ్రహం కూడా కలిపి చెప్పా చింటూ..!


చిన్నవాళ్లు అంతే..!

అంకుల్‌ : కిట్టూ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీల్లో నీకు రెండు బహుమతులు వచ్చాయి కదా..?

కిట్టు : అవును అంకుల్‌..

అంకుల్‌ : మరి మీ చెల్లికి ఎన్నొచ్చాయి?

కిట్టు : నా మీద చాడీలు చెప్పడం,ప్రతి దానికీ ఏడవడం తప్ప తనకే ఆటలూ రావు అంకుల్‌..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని