నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: చిన్నీ.. ఆంగ్ల అక్షరం ‘టి’తో ప్రారంభమయ్యే రెండు రోజుల పేర్లు చెప్పు..

Published : 19 Aug 2023 00:06 IST

కరక్టే కదా..!

టీచర్‌: చిన్నీ.. ఆంగ్ల అక్షరం ‘టి’తో ప్రారంభమయ్యే రెండు రోజుల పేర్లు చెప్పు..

చిన్ని: ‘టుడే’, ‘టుమారో’ టీచర్‌..!

టీచర్‌: ఆఁ..!


అందుకేనా వెళ్లేది..!

అమ్మ: కిట్టూ.. మొదటి వారం రోజుల్లో స్కూల్లో ఏం నేర్చుకున్నావు?

కిట్టు: పెదాలు కదపకుండా, టీచర్‌కు కనబడకుండా ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానమ్మా..

అమ్మ: ఆఁ..!


ఎంత సమయం..!

టీచర్‌: పిల్లలూ.. ఇంతటితో పాఠం అయిపోయింది.. మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి..

లహరి: ఇంటికి వెళ్లడానికి ఇంకా ఎంత సమయం ఉంది టీచర్‌..

టీచర్‌: ఆఁ..!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని