నవ్వుల్‌.. నవ్వుల్‌.!

టీచర్‌:పిల్లలూ.. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా..? విద్యార్థులు: తప్పకుండా చెప్తాం టీచర్‌..!

Published : 30 Aug 2023 00:08 IST

బడి బాగు కోసం!

టీచర్‌: పిల్లలూ.. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా..?
విద్యార్థులు: తప్పకుండా చెప్తాం టీచర్‌..!
టీచర్‌: స్కూల్‌ని శుభ్రంగా ఉంచడానికి మీరు ఏం చేస్తారు..?
విద్యార్థులు: స్కూల్‌కి రాకుండా ఇంట్లోనే ఉంటాం టీచర్‌..!
టీచర్‌: ఆఁ..!


చూశావా.. లేదా..?

చంటి: బంటీ.. నువ్వు గాలిని చూశావా.. ఎప్పుడైనా తాకావా..?
బంటి: లేదు..!
చంటి: అయితే గాలి లేనట్టే..!
బంటి: నువ్వు నీ బ్రెయిన్‌ను చూశావా.. ఒక్కసారైనా చేతితో తాకావా?  
చంటి: లేదే.. చూడలేదు..!
బంటి: అయితే.. నీకు బ్రెయిన్‌ లేనట్టే..!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని