నవ్వుల్‌... నవ్వుల్‌..!

నేనే ముందు అడిగా..! టీచర్‌: పిల్లలూ.. ఆంగ్లంలో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి..

Updated : 31 Aug 2023 04:49 IST

నేనే ముందు అడిగా..!
టీచర్‌: పిల్లలూ.. ఆంగ్లంలో మాట్లాడటం కూడా నేర్చుకోవాలి..
కిట్టు: ఓకే టీచర్‌.. ‘కెన్‌ ఐ గో టు ది హోం’..?
టీచర్‌: ‘మే ఐ గో టు ది హోం’ కిట్టూ..!

కిట్టు: అదేంటి టీచర్‌.. మొదట నేను మిమ్మల్ని అడిగాను కదా.. నేనే వెళ్తాను ఇంటికి..  


వర్షంలో ఫుట్‌బాల్‌..!
టీచర్‌: చింటూ.. ఈరోజు స్కూల్‌కు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?
చింటు: నేను తయారై ఫుట్‌బాల్‌ ఆడుతుంటే, చాలా పెద్ద వర్షం పడింది టీచర్‌..!
టీచర్‌: మరి నువ్వు తడిసిపోలేదేంటి?

చింటు: అదీ... అదంతా ఉదయం నా కలలో జరిగింది టీచర్‌.. దాంతో కాస్త ఆలస్యంగా
నిద్రలేచా..

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని