నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: కిట్టూ.. నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తావా..?

Published : 03 Sep 2023 00:02 IST

అన్నీ పుస్తకాలే..!

టీచర్‌: కిట్టూ.. నేను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తావా..?

కిట్టు: చెప్తాను టీచర్‌..

టీచర్‌: 2 పుస్తకాలు + 2 పుస్తకాలు కలిపితే మొత్తం ఎన్ని?

కిట్టు: 4 పుస్తకాలు టీచర్‌..

టీచర్‌: మరి.. 5674 పుస్తకాలు + 5850 పుస్తకాలు కలిపితే..?

కిట్టు: అప్పుడది గ్రంథాలయం అవుతుంది టీచర్‌..!

టీచర్‌: ఆఁ..!


ఏం చేయట్లేదమ్మా..!

అమ్మ: చింటూ.. స్కూల్‌ నుంచి నీ మీద కంప్లైంట్‌ వచ్చింది..

చింటు: ఏమనమ్మా..?

అమ్మ: నువ్వు అసలు క్లాస్‌లో ఏం చేయట్లేదని..!

చింటు: చూశావా అమ్మా.. నేను ఏం చేయట్లేదు.. అయినా కంప్లైంట్‌ ఇచ్చారు..!

అమ్మ: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని