నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: ఏంటి చింటూ.. పాఠం చెబుతుంటే నిద్రపోతున్నావు?

Published : 10 Sep 2023 00:33 IST

వాళ్లు వినట్లేదు..!

టీచర్‌: ఏంటి చింటూ.. పాఠం చెబుతుంటే నిద్రపోతున్నావు?
చింటు: కాదు టీచర్‌.. మీరు చెప్పే పాఠాన్ని కళ్లు మూసుకొని శ్రద్ధగా వింటున్నాను..

టీచర్‌: అలాగా.. మరి మిగతా వాళ్లు?
చింటు: వాళ్లంతా కళ్లు తెరిచి, దిక్కులు చూస్తున్నారు కానీ శ్రద్ధగా వినట్లేదు టీచర్‌..  


ఆహా.. ఏమి తెలివి?  

టీచర్‌: బంటీ.. ‘న్యూటన్‌ మొదటి నియమం’ చెప్పు?
బంటి: నాకు చివరి లైన్‌ మాత్రమే తెలుసు టీచర్‌..

టీచర్‌: సరేలే.. అదైనా చెప్పు మరి..  
బంటి: ‘దీనినే న్యూటన్‌ మొదటి నియమం అంటారు..’

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని